: టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో మోదీ


ప్రముఖ మ్యాగజైన్ 'టైమ్-2014 పర్సన్ ఆఫ్ ద ఇయర్' రేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు చేరింది. ప్రతి ఏడాది ప్రపంచ నేతలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులతో 50 మందిని ఎంపిక చేసి ఒకరిని పర్సన్ ఆఫ్ ద ఇయర్ గా టైమ్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి ఎవరో వచ్చే నెలలో పత్రిక వెల్లడించనుంది. ఒకప్పుడు 'వివాదాస్పద ప్రాంతీయ నేత'గా మోదీ ఉన్నారనీ ఈ సందర్భంగా మోదీ గురించి టైమ్ పేర్కొంది. ఇటీవలి ఎన్నికల్లో ఆర్థికాభివృద్ధి నినాదంతో తమ పార్టీ బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని సాధించిపెట్టి ప్రధాని పీఠాన్ని అధిరోహించారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఈ రేసులో మోదీకి 3.8% ఓట్లు వచ్చాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ బాలిక మలాలా, ఎబోలా వైద్యులు-నర్సులు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

  • Loading...

More Telugu News