: ఇస్లామిక్ స్టేట్ జిహాదీల నుంచి కూతుర్ని రక్షించుకున్న తల్లి


ఓ ఇస్లామిక్ స్టేట్ జిహాదీ ఫైటర్ ను పెళ్లి చేసుకోవాలని సిరియాకు వెళ్ళిన నెదర్లాండ్స్ యువతిని ఎంతో సాహసంతో రక్షించి వెనక్కు తెచ్చుకుందో తల్లి. వివరాలు ఇలా ఉన్నాయి. స్టర్లినా (19) ఐఎస్ ఫైటర్ తో నెట్ ద్వారా పరిచయం పెంచుకుని తన పేరును ఐచాగా మార్చుకొని 9 నెలల క్రితం సిరియాకు వెళ్ళింది. పరిచయం చేసుకున్నది గతంలో నెదర్లాండ్స్ సైనికుడిగా ఉంటూ ఆ తరువాత జిహాదీ ఫైటర్ గా మారిన వ్యక్తితో అయితే, సిరియా వెళ్ళాక ఆమె తప్పనిసరి పరిస్థితిలో ట్యునీషియాకు చెందిన ఫైటర్ ని వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని తల్లి మోనిక్ కు చెప్పి సహాయం చేయాలని కోరగా, ఆమె ధైర్యంగా నికాబ్ (బురఖా వంటిది) ధరించి సరిహద్దు దాటి సిరియాకు వెళ్ళింది. అంతే కాదు, ఐఎస్ మిలిటెంట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న రఖా నగరానికి చేరుకొని తన కూతురిని అంతే ధైర్యంగా తిరిగి నెదర్లాండ్స్ కు చేర్చింది. దేశంలోకి రాగానే ఆమెపై దేశద్రోహం తదితర కేసులు పెట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోనిక్ మాత్రం తన కూతురు అమాయకురాలని, కోర్టు కేసుల నుంచి తప్పక బయటపడుతుందని నమ్ముతోంది.

  • Loading...

More Telugu News