: అఖిలపక్ష సమావేశం ఆహ్వానాన్ని తిరస్కరించిన టీడీపీ, బీజేపీ
ఈరోజు తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దీంతో, ఈ విషయంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ మధుసూదనాచారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశానికి హాజరుకావాలంటూ స్పీకర్ పంపిన ఆహ్వానాన్ని టీడీపీ, బీజేపీలు తిరస్కరించాయి. దీంతో, ఈ రెండు పార్టీలు లేకుండానే అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.