: అంత రాత్రి అయితే మా వాళ్లకు కష్టం: రియో ఒలింపిక్స్ షెడ్యూల్ పై ఆస్ట్రేలియా
2016లో బ్రెజిల్ లోని రియోలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో అమెరికాకు అనుకూలంగా ఆటల పోటీల సమయాలున్నాయని ఆస్ట్రేలియా ఆరోపిస్తోంది. ఈత పోటీల ఫైనల్స్ ను రాత్రి 10 గంటలకు పెట్టడాన్ని ఆస్ట్రేలియా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు జాన్ కోట్స్ తప్పుబట్టారు. ఆ సమయంలో పోటీలు తమకు సమ్మతం కాదని ఐఓసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఇది ముసాయిదా షెడ్యూల్ మాత్రమేనని బ్రెజిల్ అధికారులు వివరించారు. ఏ సమయంలో పోటీలు ఉన్నా కొందరికి ఆ సమయం అసౌకర్యంగానే ఉంటుందని తెలిపారు.