: సీబీఐ సమన్లు ఇస్తే ఆసుపత్రిలో చేరిన బెంగాల్ మంత్రి
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు ఇస్తే ఆరోగ్యం బాగాలేదంటూ ఆసుపత్రిలో చేరిపోయాడు పశ్చిమ బెంగాల్ రవాణా మంత్రి మదన్ మిత్రా. వాస్తవానికి ఆయన నేడు సీబీఐ కార్యాలయానికి వెళ్ళాల్సివుంది. శ్వాస సరిగ్గా ఆడటంలేదంటూ ఆయన ఎస్ఎస్ కేఎం ఆసుపత్రిని ఆశ్రయించారు. దీంతో మంత్రిని ప్రశ్నించేందుకు మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు సీబీఐ అధికారులు.