: వెంకయ్యనాయుడి పాస్ పోర్టు దొరికింది
స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో జరిగిన స్మార్ట్ సిటీ సదస్సుకు హాజరైన వెంకయ్యనాయుడికి చేదు అనుభవం ఎదురైంది. సదస్సు అనంతరం తిరుగుపయనమయ్యేందుకు వస్తుండగా వెంకయ్య బస చేసిన హోటల్ లాబీలో ఆయన బ్యాగును దొంగలు తస్కరించారు. ఆ బ్యాగులో వెంకయ్యనాయుడి పాస్ పోర్టు, ఐడీ కార్డు, డబ్బుతో పాటు వెంకయ్య ప్రత్యేకాధికారి సత్య పాస్ పోర్టు కూడా ఉన్నాయి. అయితే, వెంకయ్య పాస్ పోర్టును మాత్రం హోటల్ కు దగ్గరలో రోడ్డు మీద దొంగలు వదిలేశారు. విషయం తెలిసిన భారత రాయబారి అక్కడి పోలీసులపై ఒత్తిడి తీసుకురావడంతో... కేంద్ర మంత్రి పాస్ పోర్టును పోలీసులు కనిపెట్టగలిగారు. అయితే, సత్య పాస్ పోర్టు మాత్రం దొరకలేదు. దీంతో, అప్పటికప్పుడు సత్యకు డూప్లికేట్ పాస్ పోర్టు చేయించి ఇద్దరినీ ఇండియాకు పంపించారు.