: అసెంబ్లీలో నేటి వాయిదా తీర్మానాలు


తెలంగాణ అసెంబ్లీలో పలు అంశాలపై చర్చ కోసం విపక్ష పార్టీలు వాయిదా తీర్మానాలను స్పీకర్ కార్యాలయానికి అందజేశాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టు పేరు మార్పుపై కాంగ్రెస్, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలపై టీడీపీ, ఆశా వర్కర్ల సమస్యలపై సీపీఎం, ఇంటర్ పరీక్షల వివాదంపై బీజేపీ, విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ లోని సమస్యలపై సీపీఐ వాయిదా తీర్మానాలు అందజేశాయి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును ఎన్టీఆర్ విమానాశ్రయంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై చర్చ కోసం కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు ధర్నాకు దిగారు.

  • Loading...

More Telugu News