: ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే నదుల అనుసంధానం కార్యక్రమంలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో చంద్రబాబు భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై... పరిశ్రమలకు రాయితీలు, ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నితిన్ గడ్కరీతో భేటీ అయి ఏపీలో జాతీయ రహదారులపై చర్చలు జరుపుతారు. ఈ రాత్రికి ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.

  • Loading...

More Telugu News