: కాల్పుల ఘటనలో మరో ముగ్గురి పాత్ర: పోలీసులతో ఓబులేష్


అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన తనకు మరో ముగ్గురు వ్యక్తులు సహకరించారని ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓబులేష్ పోలీసులకు చెప్పాడు. నిత్యానంద రెడ్డి వివరాలతో పాటు, కేబీఆర్ పార్కు వద్ద భద్రత, కాల్పుల అనంతరం తప్పించుకుని పోయే మార్గం తదితర విషయాల్లో తాను ఆ ముగ్గురి సహాయం తీసుకున్నట్లు అతడు వెల్లడించాడు. కర్నూలులోని ఓ లాడ్జీలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ తరలించి, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ సందర్భంగా ఓబులేష్ ఈ వివరాలను వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టిన తర్వాత కాని ఓబులేష్ అరెస్ట్ ను ధ్రువీకరించే అవకాశాలు లేవన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News