: తెలంగాణ సిలబస్ లో సోనియా జీవిత చరిత్రను చేర్చండి: కాంగ్రెస్
60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కలను నెరవేర్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలందరూ రుణపడి ఉంటారని టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కేవలం సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని చెప్పారు. ఇంతటి మహోన్నతమైన సోనియాగాంధీ జీవిత చరిత్రను తెలంగాణ పాఠ్య పుస్తకాల సిలబస్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసి వినతి పత్రం కూడా అందజేశారు.