: నన్ను సొంత కమెండోలే బంధించారు: కోర్టుకు బాబా రాంపాల్ వెల్లడి
హర్యానాలో రోజుల తరబడి పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన బాబా రాంపాల్ గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ వింత వాదనను వినిపించారు. కోర్టు ఆదేశాల మేరకు తాను పోలీసులకు సహకరించాలనే అనుకున్నా, తన సొంత కమెండోలు అందుకు అంగీకరించలేదని, తనను బయటకు రాకుండా బంధించారని ఆయన తెలిపారు. దీంతో న్యాయమూర్తి రాంపాల్ కొత్త వాదనపై విస్మయం వ్యక్తం చేశారు. 'మీ వాదన నమ్మశక్యంగా లేదే!' అంటూ న్యాయమూర్తి, రాంపాల్ ను నిలదీశారు. అంతేకాక సదరు వాదనను తిరస్కరించిన న్యాయమూర్తి కేసులో తదుపరి విచారణను కొనసాగించారు.