: భీమిలి బ్యాంక్ కాలనీలో 40 తులాల బంగారం చోరీ
విశాఖజిల్లా భీమిలి బ్యాంక్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో సుమారు 40 తులాల బంగారాన్ని దొంగలు అపహరించినట్టు అప్పలనర్సయ్య అనే రిటైర్డ్ అగ్రికల్చర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు విలువైన ఆభరణాలు దొంగిలించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.