: సల్మాన్ రెడీ...సాజిద్ బిజీ!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరో సీక్వెల్ కి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 'దబాంగ్' సినిమాకి తప్ప మరో సినిమాకి సీక్వెల్ రూపొందించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ సల్లూ భాయ్ 'కిక్'కి సీక్వెల్ తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు బాలీవుడ్ సమాచారం. తెలుగులో సూపర్ హిట్టైన 'కిక్'ను సాజిద్ నడియాడ్ వాలా నిర్మాణ, దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రానికి సల్మాన్ స్టార్ స్టామినా మరింత 'కిక్'నిచ్చి, బాక్సాఫీసును షేక్ చేసింది. దీంతో సల్మాన్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్ తీయించేందుకు సల్మాన్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, సాజిద్ పలు సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నాడు. కానీ, సల్లూభాయ్ చెబితే సినిమా తీయకుండా ఉంటాడా? అయితే కొత్తగా కథ, డైలాగులు రాయాలి. అది కాస్త కష్టమైనదే. దీనికి ఎంత సమయం పడుతుందో...'కిక్' సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి!