: శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు
శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ పేరును ఖరారు చేస్తూ కేంద్ర పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ ను ఎన్టీఆర్ డొమెస్టిక్ టెర్మినల్ గా పిలవనున్నారు. కాగా, గతంలో బేగంపేటలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరే ఉండేది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అభ్యంతరం చెప్పడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా నిర్ణయించారు. తాజాగా, డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ టెర్మినల్ గా ఖరారు చేశారు.