: రాంపాల్ ఆశ్రమంలో తనిఖీలు ప్రారంభం


వివాదాస్పద గురు బాబా రాంపాల్ ఆశ్రమంలో ఎట్టకేలకు తనిఖీలు ప్రారంభమయ్యాయి. నిన్న రాంపాల్ ను అదుపులోకి తీసుకున్న తరువాత నేటి మధ్యాహ్నం పారామిలటరీ బలగాలు ప్రధాన ద్వారం గుండా లోపలకు వెళ్లి సోదాలు ప్రారంభించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఆశ్రమంలో మారణాయుధాలు, పెద్ద ఎత్తున పెట్రోల్, యాసిడ్ తదితరాలు ఉన్నాయని అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇంకా ఆశ్రమంలో కొందరు భక్తులను అడ్డు పెట్టుకుని బాబా అనుచరులు దాక్కున్నారని వివరించారు. సాధారణ ప్రజలు ఎటువంటి భయాలు లేకుండా బయటకు రావాలని, వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News