: మాంఝీకి కళ్లెం వేసిన అధిష్ఠానం


బీహార్ ముఖ్యమంత్రి జతిన్ రాం మంఝీ దూకుడుకి పార్టీ అది అధిష్ఠానం కళ్లెం వేసింది. రోజుకో వివాదాస్పద వ్యాఖ్యతో దుమారం రేపుతున్న ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని జేడీ(యూ) అధిష్ఠానం సూచించింది. ఇతరులను అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ అధిష్ఠానానికి ఇబ్బందిగా పరిణమిస్తాయని, పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి త్యాగి స్పష్టం చేశారు. పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని ఆయన మాంఝీకి సూచించారు. వివాదాలమయమవుతున్న మాంఝీని ముఖ్యమంత్రిగా కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News