: జిమ్ లో సమంత వేషాలు... కసరత్తులు చేస్తే చిక్కిపోతుందట!
జిమ్ లో సమంత ఒళ్లొంచడానికి ససేమిరా అంటోంది. గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీసుల్ని కొల్లగొట్టిన సమంతకు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్ తలుపుతట్టింది. దీంతో అమ్మడు జిమ్ కు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. వెంటనే ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ వంటి తారలు మదిలో మెదిలినట్టున్నారు. త్రీఫోర్త్, టీషర్ట్, స్పోర్ట్స్ షూ, వర్కవుట్ గ్లోవ్స్ వేసుకుని మరీ ముడుచుకుపోయి కూర్చుంది. వారిలా తాను జీరో సైజ్ కు చేరతానేమోనని ఆందోళన చెందుతోంది. జిమ్ లో వర్కవుట్లు చేసి సన్నగా తయారైతే బబ్లీగా ఉండే తన అందమంతా కరిగిపోతుందని భయం వేస్తోందంటూ ట్వీట్ చేసింది. ఎవరైనా కాస్త చెప్పండి, చక్కనమ్మ చిక్కినా అందమేనని!