: బాబా రాంపాల్ కు జ్యుడీషియల్ కస్టడీ
వివాదాస్పద గురువు బాబా రాంపాల్ కు పంజాబ్-హర్యానా హైకోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మధ్యాహ్నం ఆయనను పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టగా, ఈ నెల 28 వరకు కస్టడీ విధిస్తున్నట్టు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను అదేరోజు చేపడతామని న్యాయస్థానం పేర్కొంది. కాగా, ఆశ్రమంలో జరిగిన అల్లర్లలో ఆరుగురు అనుచరులు చనిపోవడం పట్ల చింతిస్తున్నానని ఈ సందర్భంగా రాంపాల్ తెలిపారు.