: క్షమాపణ చెప్పిన తరువాతే రేవంత్ రెడ్డికి మాట్లాడే ఛాన్స్: హరీశ్ రావు
పార్లమెంట్ సభ్యురాలు కవితపై ఆరోపణలు చేసిన టీడీపీ సభ్యుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీకి క్షమాపణ చెప్పిన తరువాతే మాట్లాడాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు సూచించారు. టీడీపీకి మాట్లాడే అవకాశం ఇవ్వాల్సివస్తే, రేవంత్ కాకుండా మరొకరికి ఇవ్వాలని ఆయన స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి సభలో క్షమాపణలు చెప్పి మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని అన్నారు.