: అమ్మో... రోహిత్ రికార్డా... బ్రేక్ చేయడం చాలా కష్టం!: లారా


టీమిండియా డైనమిక్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వన్డేల్లో నెలకొల్పిన 264 పరుగుల రికార్డుపై విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా స్పందించాడు. మెల్బోర్న్ లో మీడియాతో మాట్లాడుతూ, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధ్యమే అయినా, రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. అది 'స్పెషల్ ఇన్నింగ్స్' అని కితాబిచ్చాడు. 1984లో మాంచెస్టర్ లో ఇంగ్లండ్ పై వివియన్ రిచర్డ్స్ నమోదు చేసిన 189 పరుగుల రికార్డు తమకు తెలుసని, ఆ తర్వాత అది చెరిగిపోయిందనీ అన్నాడు.

  • Loading...

More Telugu News