: టీడీపీని దెబ్బ తీయడమే టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది: చంద్రబాబు


తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ నేతలు పలువురు టీఆర్ఎస్ లోకి వెళ్లడం, పార్టీపై నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తమ పార్టీని దెబ్బతీయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుందన్నారు. టీడీపీకి జాతీయ పార్టీగా ఎదిగే సత్తా ఉందన్నారు. టీడీపీది రెండు కళ్ల సిద్ధాంతమని అందరూ విమర్శించినా ప్రజలు తమను ఆశీర్వదించారని బాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News