: ఫ్రాన్స్ ను భయపెట్టండి: ముస్లింలను కోరిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు
"ఇస్లాంపై నమ్మకం చూపని వారి ఆహారంలో విషం కలపండి. మీ కార్లను వారిపైకి ఎక్కించండి. ఫ్రెంచ్ ముస్లింలు అందరూ ఏకం కావాలి. ఫ్రాన్స్ ను భయపెట్టండి" అంటూ ఆ దేశానికి చెందిన నలుగురు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు 7 నిమిషాల వీడియో ను విడుదల చేశారు. ఫ్రాన్స్ వీధుల్లో భయోత్పాతం సృష్టించాలని కోరారు. వీరంతా తమ ఫ్రాన్స్ పాస్ పోర్టులను చూపుతూ వాటిని మంటల్లో దహనం చేశారు. ఫ్రాన్స్ లోని ముస్లింలు కలసిరావాలని, వారికి తాము తోడుంటామని స్పష్టమైన ఫ్రెంచ్ భాషలో వారు మాట్లాడారు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్రాన్స్ పౌరులు ఎవరో గుర్తించే పనిలో ఉన్నట్టు పారిస్ అధికారులు తెలిపారు.