: భారత సంతతికి చెందిన ప్రముఖ హోటల్ కాపలాదారు మృతి


భారత సంతతికి చెందిన ప్రముఖ హోటల్ కాపలాదారు కొట్టారపట్టు చట్టు కుట్టమ్ (91) అనే వ్యక్తి కొలంబోలో మృతి చెందాడు. వాస్తవానికి కేరళలోని ఓ గ్రామానికి చెందిన అతను, పదిహేడేళ్ల వయసులో సొంత ఊరు వదిలి 1938లో శ్రీలంక వెళ్లాడు. అప్పటి నుంచి ఉద్యోగం కోసం వెదుకులాట ప్రారంభించి, చివరికి 1942లో కొలంబోలోని గాలే ఫేస్ హోటల్లో బెల్ బాయ్ (హోటల్లో లగేజ్ మోయడం, వివిధ పనులు చేయడం) కమ్ వెయిటర్ గా చేరాడు. అలా అప్పట్లో హోటల్ కు వచ్చిన లార్డ్ మౌంట్ బాటన్, ప్రిన్సెస్ ఎలిజబెత్, పండిట్ జవహర్ లాల్ నెహ్రు, మహాత్మా గాంధీ, యూరీ గగారిన్, ఆర్థర్ సి. క్లార్క్ వంటి పలువురు గొప్ప వ్యక్తులకు సేవలు అందించాడు. దాంతో, కుట్టన్ లంక ఆతిథ్యానికి ట్రేడ్ మార్క్ గా గుర్తింపు పొందాడని, చనిపోయేవరకు అక్కడే విధులు నిర్వర్తించాడని డైలీ మిర్రర్ పత్రిక పేర్కొంది.

  • Loading...

More Telugu News