: రుణాలు ఎగ్గొట్టే వారిని పట్టుకునేందుకు డిటెక్టివ్ లను ఆశ్రయిస్తున్న బ్యాంకులు


బ్యాంకులకు తలనొప్పిగా మారిన రుణ ఎగవేతదారులను వెతికి పట్టుకునేందుకు అపరాధ పరిశోధకుల సహాయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నిరర్థక ఆస్తుల శాతం పెరుగుతున్న నేపథ్యంలో అప్పులు తీసుకున్నవారిని, వారికి గ్యారెంటీ ఇచ్చినవారిని వెతికేందుకు డిటెక్టివ్ ల సేవలను వినియోగిస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ చైర్మన్ టీఎం భాసిన్ వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 105 కేసులలో డిటెక్టివ్ సేవలు ఉపయోగపడ్డాయని తెలిపారు. మరికొన్ని బ్యాంకులు సైతం ఇదే దారిలో నడుస్తూ అప్పులు ఎగ్గొట్టేవారిని వెతికే పనిలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News