: అయ్యో... భారత క్రికెటర్లకు ఎంత కష్టం వచ్చిపడింది!


భారత్ క్రికెటర్లు భోజన ప్రియులన్న సంగతి తెలిసిందే. ఎక్కడికెళ్లినా అక్కడి వంటకాలను ఓ పట్టు పట్టందే వదలరు. కాంటినెంటల్ ఫుడ్ అంటే క్యూ కడతారు. ఇప్పుడు ఆసీస్ పర్యటన సందర్భంగా వారికి ఎంత కష్టం వచ్చిపడిందో చూడండి. మధ్యాహ్న భోజనాన్ని కేవలం బటర్ చికెన్, రైస్ తోనే సరిపెట్టుకోవాలట. కారణం, ఫిట్ నెస్ దెబ్బతింటుందన్న భయమే! స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న టీమిండియా, వెంట ఓ చెఫ్ ను కూడా తీసుకెళుతోంది. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు మెనూలో ఉండాల్సిన వంటకాల వివరాలను పంపారు మనవాళ్లు. అందులో ఎర్రని పెద్ద అక్షరాలో 'నో స్పైసీ ఫుడ్' అని రాశారు. ప్రస్తుత జట్టులో అత్యధికులు వెజిటేరియన్లు కావడంతో వారికి ప్రత్యేక ఆహారం అందిస్తారట. ఇక, బీఫ్ (పశుమాంసం), పోర్క్ (పందిమాంసం)కు నో చెప్పేశారు. బ్రేక్ ఫాస్ట్ లో గ్రిల్డ్ మష్రూమ్స్, బేక్డ్ బీన్స్, యోగర్ట్, తాజా ఫలాలు తీసుకుంటారు. లంచ్ విషయానికొస్తే బటర్ చికెన్, స్టీమ్డ్ రైస్, చేపలు, డ్రై వెజిటబుల్ కర్రీ మెనూలో చేర్చారు.

  • Loading...

More Telugu News