: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల


రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి డీఎస్సీ-2014 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలయింది. మొత్తం 9,061 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్ ను విడుదల చేశారు. డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9,10,11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతాయి. జూన్ 28న ఈ రాత పరీక్షల ఫలితాలు వెల్లడవనున్నాయి. పోస్టుల భర్తీలో స్కూల్ అసిస్టెంట్లు 1949, భాషా పండితులు 812, పీఈటీ 156, ఎస్జీటీ 6244 పోస్టులకు ఈ షెడ్యూల్ విడుదలయింది. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.

  • Loading...

More Telugu News