: ఇది రైల్వే స్టేషన్ కాదు... మృత్యు దేవత విహార స్థలి!


అలహాబాద్ హైకోర్టు బుధవారం నాడు నార్త్ సెంట్రల్ రైల్వేకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆగ్రాలోని 'రాజా కి మండీ' రైల్వే స్టేషన్ లో ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు ఆదేశం వెనుక బలమైన కారణమే ఉంది. గత నాలుగేళ్లలో ఈ స్టేషన్ వద్ద ప్లాట్ ఫాంలు చేరుకునే క్రమంలో పట్టాలు దాటుతూ 101 మంది మృత్యువాత పడ్డారు. ఆగ్రాలోని ఐదు రైల్వే స్టేషన్లలో బాగా రద్దీగా ఉండే స్టేషన్ రాజా కి మండీ. ఈ స్టేషన్ కు చాలా ప్లాట్ ఫాంలు ఉన్నాయి. ముఖ్యంగా, రెండు ప్లాట్ ఫాంలు ప్రయాణికుల పాలిట మృత్యువులా పరిణమించాయి. దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర మధ్య రైల్వేను ఆదేశించింది.

  • Loading...

More Telugu News