: బాబా రాంపాల్ ను బహిష్కరించాలని బాబా రాందేవ్ పిలుపు
రాంపాల్ వంటి దొంగ బాబాలను ప్రజలు, భక్తులు బహిష్కరించాలని యోగా గురు బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. హిస్సార్ లో రాంపాల్ మూర్ఖత్వం కారణంగా ఆరుగురు అమాయకులు మృతి చెందారని, ఈ ఘటన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు. చట్టాలకు ఎవరూ అతీతులు కారని చెప్పారు.