: ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై ఆగని దాడులు... ఢిల్లీలో మణిపూర్ విద్యార్థి దారుణ హత్య


మణిపూర్, అస్సోం తదితర ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్న విద్యార్థులకు రాజధానిలో రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మణిపూర్ కు చెందిన జింగ్ రామ్ కెన్గో (33)ను ఆగంతుకులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కోట్ల ముబారక్ పూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్య దొంగతనం కోసం చేసినదిగా లేదని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జింగ్ రామ్ కుటుంబసభ్యులకు సమాచారం అందించామని, కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా, పీహెచ్ డీ చేసేందుకు జింగ్ రామ్ నెల క్రితమే హస్తినకు వచ్చాడని... టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో పీహెచ్ డీ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News