: కాకతీయుల స్ఫూర్తితోనే చెరువుల అభివృద్ది: మంత్రి హరీశ్
కాకతీయుల స్ఫూర్తితోనే తెలంగాణలో చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకే చెరువుల అభివృద్ధిని చేపడుతున్నట్లు ఆయన గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి రంగంలో తెలంగాణ నిరాదరణకు గురైందని, నాటి నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని ఆయన వివరించారు. గతంలో పది జిల్లాలకు ఓ ఎస్ఈ ఉండగా, ప్రత్యేక రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ ఓ ఎస్ఈని నియమించామన్నారు.