: నా పేరు ప్రచారంలో ఉన్న మాట వాస్తవమే... కానీ, నేను సరిపోనేమో!: బీవీ రాఘవులు
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్న బీవీ రాఘవులు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై రాఘవులు స్పందించారు. పార్టీ జాతీయ కార్యదర్శి పదవికి తన పేరు పరిశీలనలో ఉన్న మాట వాస్తవమేనని... అయితే, ఆ పదవికి తాను సరిపోనేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. విశాఖలో జరగనున్న అఖిల భారత సీపీఎం మహాసభల్లో ప్రస్తుత జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ స్థానంలో కొత్త నాయకుడు వస్తారని రాఘవులు స్పష్టం చేశారు. ఈ సమావేశాలు అత్యంత కీలకంగా మారనున్నాయని చెప్పారు. భవిష్యత్తులో సీపీఎం, సీపీఐలు కలసి పనిచేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.