: రాజకీయాల్లోకి వచ్చేది లేదు: రజనీ కాంత్


రాజకీయ రంగ ప్రవేశంపై మరోమారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నోరు విప్పారు. రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదని గురువారం ఆయన కుండబద్దలు కొట్టారు. 45వ అంతర్జాతీయ చలచిత్రోత్సవాల్లో పాల్గొనేందుకు గోవా వచ్చిన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. "నో, నెవర్...నో పాలిటిక్స్ ఫర్ మి" అంటూ ఆయన రాజకీయాల్లోకి ఎప్పటికీ అడుగు పెట్టబోనని తేల్చిచెప్పారు. తన తాజా చిత్రం 'లింగ' ఆడియో వేడుక సందర్భంగా రాజకీయాలంటే తనకేమీ భయం లేదని ప్రకటించిన రజనీ, ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్న వారిలో అలజడి రేపారు. అయితే గురువారం గోవాలో రజనీ చేసిన ప్రకటన అందుకు విరుద్ధంగా ఉండటం విశేషం. నాడు వేదికపై పలువురి అభ్యర్థన మేరకే రాజకీయాలపై రజనీ స్పందించారన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News