: నేడు ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్


ఆంధ్రప్రదేశ్ లో నేడు ఉపాధ్యాయుల భర్తీకి డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. నేటి ఉదయం 11 గంటలకు డీఎస్సీ-2014 నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నోటిఫికేషన్ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రకటన బుధవారం రాత్రి వెలువడగా, నోటిఫికేషన్ మాత్రం నేడు విడుదల కానుంది. ఈ ప్రకటనతో మొత్తం 9,061 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. వీటిలో 6,244 పోస్టులు సెకండరీ గ్రేడ్ పోస్టులు కాగా, మిగిలిన 1,849 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు.

  • Loading...

More Telugu News