: ఇప్పుడు కాల్పులు జరిగాయి కాబట్టే సెక్యూరిటీ పెట్టారు: సినీ నటుడు చలపతిరావు


వీఐపీలు సంచరించే కేబీఆర్ పార్క్ వద్ద కాల్పులు జరగడంతో ప్రభుత్వం, పోలీసులు అలర్ట్ అయ్యారు. పార్క్ వద్ద సెక్యూరిటినీ అమాంతం పెంచేశారు. దీనిపై, ప్రముఖ సినీ నటుడు చలపతిరావు స్పందించారు. 15 ఏళ్లుగా తాను కూడా ఇక్కడకు వాకింగ్ కోసం వస్తున్నానని... ఏనాడూ సరైన సెక్యూరిటీ లేదని మండిపడ్డారు. ప్రతిరోజు ఎంతో మంది వీవీఐపీలు ఇక్కడకు వస్తుంటారని... ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాకింగ్ చేస్తుంటారని... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రోజూ వస్తారని చెప్పారు. ఇప్పటిదాకా ఎలాంటి ఘటనలు జరగలేదు కాబట్టి సెక్యూరిటీ పెట్టలేదని... ఇప్పుడు కాల్పులు జరిగాయి కాబట్టి వెంటనే సెక్యూరిటీ అరేంజ్ చేశారని అన్నారు. ఇంతమంది వీఐపీలు వాకింగ్ చేసే చోట సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్క్ వద్ద సెక్యూరిటీని ఎప్పటికీ కొనసాగించాలని సూచించారు.

  • Loading...

More Telugu News