: ఫడ్నవిస్ సర్కారుకు ఎన్సీపీ మద్దతు నిర్ణయం సరికాదు: పవార్ కూతురు సుప్రియ


మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిర్ణయం సరి కాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో పార్టీ నేతల నుంచి నిరసన ఎదుర్కొంటున్న శరద్ పవార్ కు బుధవారం తన సొంత కూతురు, పార్టీ ఎంపీ సుప్రియా సూలే నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఫడ్నవిస్ ప్రభుత్వానికి బేషరతు మద్దతు ప్రకటించి, పార్టీ పొరపాటు చేసిందని సుప్రియ బుధవారం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం, మైనారిటీలను పార్టీకి దూరం చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధం కావాలని మంగళవారం ప్రకటించిన శరద్ పవార్, మరునాడే యూటర్న్ తీసుకున్నారు. ఫడ్నవీస్ సర్కారును కూలనివ్వబోమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతామని ప్రకటించారు. దీంతో పవార్ వ్యాఖ్యలపై పార్టీ నేతల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News