: రద్దయిన బొగ్గు గనుల వేలం... ఫిబ్రవరి 11 నుంచి!


అక్రమాలు చోటుచేసుకున్నాయని సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల వేలం ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానుంది. అయితే ఈ రంగంలో కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఒక కంపెనీ పరిమితికి లోబడే వేలంలో పాల్గొనాలన్న కొత్త నిబంధనను ఈ దఫా అమలు చేయనున్నట్లు కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ చెప్పారు. కేటాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంగా 204 బొగ్గు గనులను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి కేటాయింపుల కోసం కొత్తగా వేలం నిర్వహించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్త వేలం ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నట్లు అనిల్ స్వరూప్ బుధవారం చెప్పారు. వేలంలో భాగంగా తొలి దశలో 74 గనుల వేలాన్ని చేపడతామని, తర్వాతి దశల్లో మిగిలిన గనుల కేటాయింపులకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News