: హవాయి రోడ్లపై ప్రవహిస్తున్న 'లావా'


అమెరికాలోని హవాయి ద్వీపంలో అగ్నిపర్వతం బద్దలైంది. పెల్లుబుకుతున్న లావా ఏకంగా కిలోమీటర్ల మేర విస్తరిస్తూ కిలోయి అనే గ్రామానికి చేరుకుంది. రోడ్డు మీద నెమ్మదిగా కదులుతోంది. దీంతో అక్కడ నివసిస్తున్న ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతతో ఉండే లావా అక్కడి వైర్లను, చెట్లను దహించడమే కాకుండా, ఇప్పటికే ఓ ఇంటిని కూడా ఆహుతి చేసేసింది. దీనిని అదుపు చేయడానికి అమెరికా ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. స్వచ్ఛంద సంస్థలు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.

  • Loading...

More Telugu News