: పొగమంచు గుప్పిట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు... విమాన రాకపోకలకు అంతరాయం
హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచు ఆవరించి ఉన్న కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దుబాయ్ నుంచి రావాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని అధికారులు ఇప్పటికే చెన్నై మళ్లించారు. ఎయిర్ ఇండియా విమానం రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. మరిన్ని విమానాల రాకపోకలపైనా పొగమంచు ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు.