: రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆ సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్ వేటు!
అసెంబ్లీ బందోబస్తు విధుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ లాడ్జీలో రాసలీలల్లో మునిగిపోయిన సీఐ స్వామి, మహిళా ఎస్సై రాజ్యలక్ష్మిలపై సస్పెన్షన్ వేటు పడింది. గతవారం వెలుగు చూసిన ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు బాసులు ఇప్పటికే ఆ ఇధ్దరు అధికారులపై బదిలీ వేటు వేయగా, తాజాగా సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ బందోబస్తు కోసం వచ్చిన కరీంనగర్ త్రీ టౌన్ సీఐ స్వామి, వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్యలక్ష్మి...హైదరాబాదులోని ఓ లాడ్జీలో రాసలీలల్లో మునిగి ఉండగా, ఎస్సై భర్తనే పోలీసులకు సమాచారమిచ్చి వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడేలా చేశారు. ఇరువురు అధికారులకు వేర్వేరు లాడ్జీల్లో బస ఏర్పాటు చేసినా, వారు మాత్రం ఒకే లాడ్జీలో దూరి పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్సై భర్త ఫిర్యాదు మేరకు వారిద్దరిపై నగర పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.