: కాల్పుల నిందితుడి ఊహాచిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు


కేబీఆర్ పార్క్ వద్ద అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడి ఊహాచిత్రాన్ని హైదరాబాద్ పోలీసులు విడుదల చేశారు. కాల్పుల అనంతరం పారిపోయిన నిందితుడు కారులోనే తన బ్యాగును వదిలి వెళ్లాడు. ఈ బ్యాగులో మెహదీపట్నంలోని ఓ సూపర్ మార్కెట్లో సరుకులు కొన్న స్లిప్ దొరికింది. ఈ స్లిప్ ఆధారంగా సదరు సూపర్ మార్కెట్ సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. అంతేకాకుండా నిత్యానందరెడ్డికి కూడా చూపించారు. నిందితుడిని పట్టుకునేందుకు 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

  • Loading...

More Telugu News