: మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు


మంత్రులు, హెచ్ వోడీలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఆశించినంత పనితీరు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయం ఏర్పరుచుకోవాలని, ఫైళ్లను క్లియర్ చేయడంలో అలసత్వం తగదని సూచించారు. నెలకోసారి హెచ్ వోడీలు, అధికారులతో కలసి నివేదికలు తయారు చేసి పంపించాలని ఆదేశించారు. వారానికి కనీసం రెండు రోజులైనా జిల్లాల్లో పర్యటించాలని, తమతమ శాఖల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని మంత్రులకు హితవు పలికారు.

  • Loading...

More Telugu News