: సొంత ఊళ్లలో టీమిండియా క్రికెటర్ల 'స్వచ్ఛ భారత్'


ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుకు స్పందించి టీమిండియా స్టార్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. రైనా స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కాగా, ధావన్ ఢిల్లీ వాసి. స్థానికులతో కలిసి చీపురు పట్టిన రైనా వెంట పిల్లలు కూడా నడిచారు. వారూ చీపురు పట్టి భావిపౌరులమని చాటారు. ఈ సందర్భంగా రైనా మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ అభియాన్ లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నాడు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించాలని రైనా సూచించాడు. అనంతరం ట్వీట్ చేశాడు. 'స్వచ్ఛ భారత్ అభియాన్' అన్నది దేశభక్తికి పర్యాయపదం వంటిదని పేర్కొన్నాడు. అంతేగాకుండా, రైనా ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే యూపీ జట్టు సహచరులు పియూష్ చావ్లా, ప్రవీణ్ కుమార్, ఆర్పీ సింగ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, హాకీ క్రీడాకారుడు శ్రీజేష్, బాలీవుడ్ సింగర్లు శ్రేయా ఘోషల్, సోనూ నిగమ్, బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, కె.శ్రీకాంత్ లను 'స్వచ్ఛ భారత్' లో పాల్గొనాలంటూ సవాల్ చేశాడు. అటు, టీమిండియా డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఢిల్లీలో చీపురు పట్టి శుభ్రం చేశాడు.

  • Loading...

More Telugu News