: భారత్‌లో చదువుకునే ఫిజీ విద్యార్ధులకు డబుల్‌ స్కాలర్‌షిప్‌: మోదీ


భారత్‌లో విద్యను అభ్యసించే ఫిజీ విద్యార్థులకు రెట్టింపు ఉపకార వేతనాన్ని అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. బుధవారం ఫిజీలో ఆయన మాట్లాడుతూ, తమ దేశపు వారసత్వపు విలువలను కాపాడుకుంటూనే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఫిజీ విద్యార్థులకు సూచించారు. డిజిటల్‌ ఇండియా నిర్మాణం ద్వారా భారత్‌ను ప్రపంచ దేశాల సరసన నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. ఫిజీ నేషనల్‌ యూనివర్శిటీలో ఆయన హిందీలో ప్రసంగిస్తూ ఇక్కడి జనాభాలో 37 శాతం మంది భారత సంతతికి చెందిన వారేనని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News