: పారిపోయేందుకు ప్రయత్నించిన రాంపాల్ అనుచరుడు అరెస్టు


హర్యానాలోని హిస్సార్ లో వివాదాస్పద గురువు బాబా రాంపాల్ అనుచరుడు పురుషోత్తం దాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్రమం నుంచి అతను పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఆశ్రమానికి విద్యుత్తు, నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం ఆశ్రమంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. రాంపాల్ ను అరెస్టు చేసేందుకు పోలీసుల ప్రయత్నం కొనసాగుతూనే ఉంది.

  • Loading...

More Telugu News