: చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ మాయలపకీర్లు: సీపీఐ నారాయణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ మాయలపకీర్లని సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులయినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. మాటలు చెపుతూ జనాలను మాయ చేస్తున్నారని విమర్శించారు. రెండు రాష్ట్రాల్లోనూ రైతు రుణాలు మాఫీ కాలేదని, పింఛన్ల పరిస్థితి కూడా గందరగోళంగా ఉందని ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలసికట్టుగా పనిచేస్తూ, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు.