: మట్టి తవ్వుతుంటే దొరికిన అరుదైన బుద్ధ ప్రతిమ


కృష్ణా జిల్లా ఘంటసాల వద్ద మట్టి తవ్వకాలు జరుపుతుంటే అరుదైన బుద్ధుని ముఖ ప్రతిమ దొరికింది. స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలోని తెన్నేరమ్మ దిబ్బ వద్ద పనులు చేస్తున్న నాంచారయ్యకు ఈ ప్రతిమ దొరికింది. ఇది పురాతనమైన రాతి బుద్ధ విగ్రహమని, దీనిని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించి బౌద్ధ మ్యూజియంలో భద్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు జి.వెంకట రామకృష్ణ తెలిపారు.

  • Loading...

More Telugu News