: గవర్నర్ తో ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల భేటీ
గవర్నర్ నరసింహన్ తో రాజ్ భవన్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. ఇంటర్ పరీక్షల గందరగోళంపై మంత్రులతో గవర్నర్ చర్చిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించేందుకు గతంలో జరిగిన ఓ సమావేశంలో ఒప్పుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఇటీవల సొంతంగానే నిర్వహించుకుంటామంటూ ఏపీకి స్పష్టం చేసింది. పరీక్షలను కలిపే నిర్వహించాలని, లేకుంటే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని ఏపీ వాదిస్తోంది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. దాంతో, విషయం గవర్నర్ వరకు వెళ్లింది.