: కాల్పుల ఘటనలో దర్యాప్తు ముమ్మరం... సస్పెండైన గ్రేహౌండ్స్ పోలీసుల పాత్ర ఉందా?


హైదరాబాదులోని కేబీఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఏకే47 మిస్ అయిన కేసులో ఏడుగురు గ్రేహౌండ్స్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ రోజు జరిగిన కాల్పుల ఘటనలో వీరిలో ఎవరి పాత్ర అయినా ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు, సెల్ టవర్ లొకేషన్, సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాల్పులకు తెగబడ్డ ఆగంతుకుడు ట్రాక్ సూట్, తెలుపు రంగు టీ షర్ట్ ధరించినట్టు పోలీసులు గుర్తించారు.

  • Loading...

More Telugu News