: చంద్రబాబు చెప్పేదంతా చెవిలో పూలు పెట్టుకుని వినాలా?: వాసిరెడ్డి


ఏపీ రాజధాని నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రాజధాని నిర్మాణం విషయంలో ప్రతిపక్షాన్ని ప్రభుత్వం పరిగణనలోకి కూడా తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికే పూర్తి అవగాహన లేనప్పుడు... ప్రజలు వారి భూములను ఎందుకిస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం విషయంలో చంద్రబాబు ఏది చెబితే అది చెవిలో పూలు పెట్టుకుని వినాలా? అని మండిపడ్డారు. ల్యాండ్ మాఫియాకు ప్రభుత్వం సహకరిస్తోందని అన్నారు. రాజధాని ఏర్పాటు కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News