: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదు: మంత్రి శిద్ధా
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచన లేదని మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. అంతేగాక, ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని కూడా స్పష్టం చేశారు. కేవలం ఈ సంస్థ బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి చెప్పారు. మార్చి 15 నాటికి 1,080 కొత్త బస్సులు వస్తాయని... విశాఖ, విజయవాడ బస్ స్టేషన్లను ఆధునికీకరిస్తామని వివరించారు. ప్రతి బస్టాండులో మినరల్ వాటర్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.